KTR : ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా.. కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు

చట్టాలను గౌరవించి తాను ఏసీబీ విచారణకు వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు;

Update: 2025-01-06 04:58 GMT

చట్టాలను గౌరవించి తాను ఏసీబీ విచారణకు వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ కార్యాలయానికి తన న్యాయవాదులతో వచ్చిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులను విచారణ సమయంలో అనుమతించబోమని చెప్పడంతో అక్కడే వెయిట్ చేస్తున్నారు. గతంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలోనూ తాను చెప్పని విషయాలను చెప్పినట్లు చూపించి అరెస్ట్ చేశారన్నారు. తాను ఏసీబీ విచారణకు హాజరవుతున్న సమయంలో తన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశముందని కూడా కేటీఆర్ మీడియాతో అన్నారు.

న్యాయవాదులతో...
ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కేటీఆర్ ను నేడు ఏసీబీ అధికారులు విచారణ పిలవగా ఆయన తన న్యాయవాదుల బృందంతో కలసి రావడంతో అందుకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఏసీబీ అధికారులు మాత్రం న్యాయవాదులను అనుమతించబోమని చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని, అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనకు న్యాయవాదులతో విచారణకు హాజరయ్యే హక్కు ఉందని కేటీఆర్ తెలిపారు.


Tags:    

Similar News