KTR : నేడు కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తారా? ఎన్ని గంటలు?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది;

Update: 2025-01-06 02:47 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఫార్ములా ఈ కారు రేసు విషయంలో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఏసీబీ అధికారులు విచారణకు రావాలని కోరారు. అయితే కేటీఆర్ ఈ విచారణకు ఏసీబీ విచారణకు వస్తారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా ఏసీబీ అధికారులు చేర్చారు. ఫార్ములా ఈ కారు రేసులో పెద్దయెత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విదేశీ సంస్థలకు నిధులను అప్పనంగా విడుదల చేశారంటూ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

యాభై నాలుగు కోట్లను...
ఫార్ములా ఈ కారు రేసు విషయంలో 54 కోట్ల రూపాయల నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా నిధులను చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఎవరితో ప్రమేయం లేకుండా అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించడంపై ఈ కేసు నమోదయింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 7వ తేదీన విచారణకు రావాలని నోటీసులు అందచేశారు. ఈడీ విచారణకు ఒకరోజు ముందుగానే ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేయనుండటంతోఆసక్తికరంగా మారింది.
అరెస్ట్ చేయవద్దంటూ...
అయితే కేటీఆర్ మాత్రం తాను ఏసీబీ విచారణకు హాజరవుతానని నిన్న చెప్పారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే తనను అరెస్ట్ చేయవద్దంటూ కేటీఆర్ వేసిన పిటీషన్ పై హైకోర్టులోనూ విచారణ జరిగింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణను కొనసాగించవచ్చని పేర్కొంది. ఇందులో భాగంగానే కేటీఆర్ కు ముందు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ కంటే ముందు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చినా వారు ఈడీ అనుమతితో కొంత సమయం తీసుకున్నారు. ఈరోజు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ఎంతసేపు విచారిస్తారన్నది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News