Kalvakuntla Kavitha : ఐదు నెలల తర్వాత హైదరాబాద్‌కు నేడు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్ రానున్నారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత నిన్న విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆమె రాత్రి 9 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చారు. తాను మొండి దానిని అని, అక్రమ కేసులు పెట్టి వేధించినా ఎదుర్కొంటానని, తనపై కేసులు పెట్టిన వారిని వదలబోనని వార్నింగ్ ఇచ్చారు.
కోర్టుకు హాజరై...
ఈరోజు కవిత హైదరాబాద్ బయలుదేరి రానున్నారు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన అనంతరం కవిత ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న కవితకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.