Kalvakuntla Kavitha : నేడు జనగామ జిల్లాకు కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు;

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు పెంబర్తి గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. విశ్వకర్మ హస్తకళల కేంద్రాన్ని కవిత ఈ సందర్బంగా సందర్శించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ కార్యకర్త రేఖ రాజ్ ను కవిత పరామర్శించనున్నారు.
పెంబర్తి గ్రామంలో...
తర్వాత గ్రామ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడతారు. తర్వాత జనగామలో జాగృతి నాయకుడు మురళి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. కవిత జనగామ జిల్లా పర్యటనకు వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.