KTR : రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి అభినందనలు తెలిపారు;

Update: 2025-02-08 05:50 GMT
ktr, brs, congrats, rahul gandhi
  • whatsapp icon

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి అభినందనలు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తున్న నేపథ్యంలోనే కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేస్తూ బీజేపీని గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ వల్లనే బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు.

చివరి రౌండ్ వరకూ...
అయితే ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగుతుంది. బీజేపీ 41 అసెంబ్లీ స్థానాల్లోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ ఆధిక్యతలో లేకపోవడంతో కేటీఆర్ ఈ రకమైన ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి చివరి రౌండ్ వరకూ ఉత్కంఠ నెలకొనే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా


Tags:    

Similar News