ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది;
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం సంభవించింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది. కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టుకు వెళితే తమ వాదనలను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కేవియట్ ద్వారా పేర్కొంది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు కూడా వినాల్సి ఉంటుంది.
తమ వాదనలను కూడా...
కేటీఆర్ వాదన మాత్రమే కాకుండా తమ తరుపున వాదనలను కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని భావించి ముందుగానే ప్రభుత్వం కేవియట్ పిటీషన్ ను దాఖలు చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ