Congress : నేడు గాంధీ భవన్ లో కీలక భేటీ
నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానుంది;
నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానుంది. దీపాదాస్ మున్షీ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరుగుతుంది. ముఖ్యఅతిథిగా కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు. దాదాపు 22 మంది పీఏసీ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి వస్తారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు.
కీలక అంశాలపై...
అయితే ఈ పీఏసీ కమిటీ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పీసీసీ కమిటీలపై చర్చ జరుగుతుంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. వివిధ రాజకీయ అంశాలతో పాటు పార్టీ, ప్రభుత్వ పదవుల పంపకంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now