KTR : సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు;
మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ...
ఈరోజు ఉదయం హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేయగా ఈరోజే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉదయం నుంచి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు మధ్యాహ్నమే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో కేవియట్ పిటీషన్ వేయడంతో ప్రస్తుతం ఈ కేసు పంచాయతీ హస్తినకు చేరుకున్నట్లయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now