Breaiking : కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఈ నెల 16న
కేటీఆర్ కు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.;
కేటీఆర్ కు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 16వ తేదీన హాజరు కావాలని కోరారు. ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారుల విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో ఈరోజు కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టివేయడంతో ఆయన విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈరోజు హాజరు కావాల్సిఉన్నా...
వాస్తవానికి ఈరోజు ఈడీ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ హైకోర్టులో తీర్పు రానుందని, తాను ఈరో్జు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ చెప్పడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అందుకు సమ్మతించారు. మరోసారి రావాల్సి ఉంటుందని తెలిపారు. దీనిప్రకారంఈ నెల 16వ తేదీనవిచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ