KTR : తెలంగాణ గొంతుకపై నిషేధమా?
కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ గొంతుకపైనే నిషేధమా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్ కు ప్రవచనాల్లాగా వినిపించాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రచారాన్ని నిషేధించడమేంటని ఆయన ప్రశ్నించారు.
మోదీ వ్యాఖ్యలు వినిపించలేదా?
మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మోదీ విధ్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ వినిపించడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బడే భాయ్..చోటే భాయ్ కలిసి కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.