గవర్నర్ ప్రసంగంపైనే
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత సమావేశాలు వాయిదా పడతాయి. సాయంత్రం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలన్నది నిర్ణయిస్తుంది.
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు...
ఈ నెల 14వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 4న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టి సభ్యులు మాట్లాడేందుకు అవకాశమిస్తారు. ఈ నెల 6వ తేదీన శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, శాసనమండలిలో వేముల ప్రశాంతరెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతారా? సొంత స్క్రిప్ట్ ను చదువుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.