Kalvakuntla Kavitha liquor scam case: నేడు కవిత కేసు సుప్రీంలో విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
Kalvakuntla Kavitha liquor scam case:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు జారీ అయిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్వకుంట్ల కవితకు ఈడీతో పాటు సీబీఐ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత తనను విచారించేందుకు ఇంటికే రావాలని, తనను కార్యాలయంలోకి విచారణకు పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ ఈ పిటీషన్ దాఖలు చేశారు.
తనపై చర్యలకు దిగకుండా....
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత తన పిటీషన్ లో కోరారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. సీఆర్పీసీ ప్రకారం మహిళలను ఇంట్లోనే విచారించాలన్న కవిత వాదనలపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఇంట్లోనే విచారించాలని కవిత తరుపున న్యాయవాదులు కోరనున్నారు.