రంజాన్ రోజూ విచారణ
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు రంజాన్ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు రంజాన్ రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. నాలుగో రోజు వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ లను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారిస్తున్న అధికారులు ఈ నెల 25వ తేదీ వరకూ విచారణ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
సీబీఐ అధికారులు
చంచల్‌గూడ జైలు నుండి ఇద్దరినీ సీబీఐ కార్యాలయానికి తరలించిన సీీీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుందని సమాచారం. ఈ నెల 24వ తేదీ వరకూ సుప్రీంకోర్టు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని చెప్పడంతో ఆరోజు విచారణలో ఏం జరగనుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.