రెండురోజుల్లో తెలంగాణకు కేంద్ర బలగాలు

రెండు రోజుల్లో తెలంగాణకు కేంద్ర బలగాలు రానున్నాయి. ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బలగాలు పెద్దయెత్తున తరలి వస్తున్నాయి.

Update: 2023-10-20 07:38 GMT

రెండు రోజుల్లో తెలంగాణకు కేంద్ర బలగాలు రానున్నాయి. తెలంగాణ ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బలగాలు పెద్దయెత్తున తరలి వస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు పహారా కాయనున్నాయి. బందోబస్తుతో పాటు తనిఖీలు కూడా కేంద్ర బలగాలు చేపట్టనున్నాయి. తెలంగాణలో ఈసారి హోరా హోరా పోరు నెలకొని ఉండటంతో దాదాపు అన్ని నియోజవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార, విపక్ష పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో కేంద్ర బలగాలు అదనంగా కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరినట్లు తెలిసింది.

సమస్యాత్మక ప్రాంతాల్లో...
దీంతో కేంద్ర బలగాలు అధికంగా రానున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో వీటిని మొహరించనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర బలగాలు ఉపయోగపడతాయని ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుంది. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు రెండు రోజుల తర్వాత మార్చ్ కూడా చేరనున్నాయి. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కేంద్ర బలగాలను ఉంచేలా ఎన్నికల కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఈవీఎంలను సురక్షితంగా కౌంటింగ్ కేంద్రాలకు చేర్చే బాధ్యతను కూడా కేంద్ర బలగాలకు అప్పగించనున్నారు.


Tags:    

Similar News