Breakfast scheme: పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని కూడా ప్రవేశ పెట్టాలి: సీతక్క

పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని

Update: 2024-09-10 15:21 GMT

మధ్యాహ్న భోజన పథకం తరహాలో పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని తెలంగాణ మంత్రి దానసరి అనసూయ అలియాస్ ‘సీతక్క’ కోరారు. అలా చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ప్రోత్సహించడమే కాకుండా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో దోహదపడుతుందని సీతక్క అన్నారు.

సామాజిక న్యాయం, సాధికారత, వికలాంగుల సాధికారత శాఖల ఆధ్వర్యంలో ఆగ్రాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో పేద కుటుంబాలకు చెందిన చాలా మంది విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలకు వస్తున్నారని, పాఠశాలలో అల్పాహారం అందించడం వల్ల వారిలో ఏకాగ్రత కూడా మెరుగవుతుందని అన్నారు. ములుగు జిల్లాలో కంటైనర్‌లో చిన్న ఆసుపత్రిని ప్రారంభించి చేసిన ప్రయోగం విజయవంతమైందని, దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాలని ఆమె కోరారు.


Tags:    

Similar News