తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కేటాయించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
మరో ఇద్దరు ఎమ్మెల్సీలను...
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిపల్లా రాజేశ్వర్‌రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. అయితే గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే మరో ఇద్దరు ఎమ్మెల్సీ పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.