డ్రగ్స్ మాటే వినపడకూడదు

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు

Update: 2022-01-26 08:30 GMT

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కేసీఆర్ ఎక్సైజ్, హోంమంత్రితో సమావేశమై డ్రగ్స్ పై సమీక్ష జరిపారు. ఈనెల 28 వ తేదీన ప్రగతిభవన్ లో 'స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్' జరుపాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ అద్యక్షతన జరగనున్న ఈ సమావేశంలోలో హోం మంత్రి, ఎక్సైజ్ మంత్రి తో పాటు సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని జిల్లా ల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ లు పాల్గొననున్నారు.

కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ఏర్పాటు...
రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కేసులో ఎంతటి వారు దొరికినా వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, ఇక్కడ మరింత నిఘాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News