చెప్పులు మోసే మోసకారులను నమ్మొద్దు

గుజరాత్ లో దోపిడీ తప్ప ప్రజా సంక్షేమ పథకాలు ఏవీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

Update: 2022-08-29 12:15 GMT

గుజరాత్ లో దోపిడీ తప్ప ప్రజా సంక్షేమ పథకాలు ఏవీ అమలు కావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు అక్కడ లేవన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. గుజరాత్ దొంగలు, అక్కడి నుంచి వచ్చే గులాముల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారన్నారు. వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

బీజేపీకి మీటరు...
తాను 26 రాష్ట్రాల రైతు ప్రతినిధులతో మాట్లాడానని, వారి రాష్ట్రాల్లో కనీసం ఒడ్లు కూడా కొనరని చెప్పారన్నారు. గోల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం మోదీకి చేతకాదన్నారు. మీటర్లు ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీకే మీటర్ ప్రజలందరూ కలసి మీటరు పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక్కసారి మోసపోయామంటే మళ్లీ వెనక్కు వెళతాం అని ఆందోళన వ్యక్తం చేశారు. దేనినైనా కూలగొట్టడం చాలా సులువని, కట్టడమే కష్టమని ఆయన తెలిపారు. చెప్పులు మోసే వారు కారు కూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. సింగరేణి కార్మికలోకం కన్నెర్ర చేసి ముందుకు కదలాలని ఆయన పిలుపు నిచ్చారు. మతపిచ్చిగాళ్ల నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నారు.


Tags:    

Similar News