నేడు రామగుండంలోకి భట్టి పాదయాత్ర

ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసింది. నేడు పెద్దపల్లి జిల్లా రామగుండంలోకి ప్రవేశించనుంది

Update: 2023-04-16 03:20 GMT

ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసింది. నేటి సాయంత్రం పెద్దపల్లి జిల్లా రామగుండంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. మల్లు భట్టి విక్రమార్క రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి అనుబంధంగా గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఐబీ చౌరస్తా ఎల్లంపల్లి నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

గత కొద్ది రోజులుగా...
ఇటీవల మంచిర్యాలలోనూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం కల్పించాలంటూ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు విశేష స్పందన వస్తుంది.


Tags:    

Similar News