Vijayashanthi : విజయశాంతికి బెదిరింపులు.. నరకం ఏంటో చూపిస్తానంటూ?
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.;

కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు విజయశాంతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నరకం ఏంటో చూపిస్తానంటూ చంద్రశేఖర్ తమను బెదిరించారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా అకౌంట్ ను...
విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను మెయిన్ టెయిన్ చేయడానికి చంద్రశేఖర్ పెద్దమొత్తంలో వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడు. తర్వాత సోషల్ మీడియా అకౌంట్ ను మెయిన్ టెయిన్ చేయకుండానే వదిలిపెట్టాడు. దీంతో ఇదేంటని ప్రశ్నించిన విజయశాంతి దంపతులను చంద్రశేఖర్ బెదిరించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.