దేశానికి టీ హబ్ రోల్ మోడల్
టీ హబ్ దేశానికి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ప్రతిభావంతులన్ని ఆకర్షించడానికి ప్రారంభించామన్నారు
టీ హబ్ దేశానికి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశంలో ప్రతిభావంతులన్ని ఆకర్షించడానికి దీనిని ప్రారంభించామన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని చెప్పారు. టీ హబ్ కొత్త సెంటర్ ను ముఖ్యమంత్రి కేైసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రపంచలోనే ఐటీ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా ఉందని చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు టీ హబ్ నుంచి పుట్టుకొస్తాయని చెప్పారు. 2015 లో టీ హబ్ ను ప్రారంభించామని చెప్పారు. టీ హబ్ ను రూపొందించడంలో మంత్రి కేటీఆర్, అధికారులు చేసిన కృషిని కేసీఆర్ ప్రశంసించారు.
అంతర్జాతీ ప్రమాణాలతో....
అంతర్జాతీ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో టీ హబ్ 2.0 గా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇదొక ప్రత్యేక భవనమని, సుమారు 276 కోట్ల రూపాయలతో శాండ్ విచ్ ఆకారంలో దీనిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ లు పాల్గొన్నారు. టీహబ్ ను తీర్చి దిద్దిన అధికారులను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రశంసించారు.