మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి

Update: 2023-12-30 10:49 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు అందించారు. డిసెంబర్ 23న గిగ్ వర్కర్స్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇచ్చిన మాట మేరకు.. కేవలం వారం రోజుల్లోనే అధికారులు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయాన్ని అందించారు.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శనివారం ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ రోడ్డులో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 11.45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ రావడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ దారి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తాను వస్తున్నానని చెప్పి ప్రజలను గంటలకొద్ది ఆపివేయవద్దని ట్రాఫిక్ అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News