Telangana : తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు
తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది;
తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్ లో ఛైర్మన్ తో పాటు ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకూ సమగ్ర విధానాన్ని రూపొందించడానికి ఈ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సభ్యుల పదవీ కాలం రెండేళ్ల పాటు ఉండనుంది.
నూతన విద్యావిధానాన్ని...
ప్రధానంగా ప్రాధమిక పాఠశాలల్లో మార్పులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తీసుకోవాల్సిన చర్యలతో పాటు నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థులకు చిన్ననాటి నుంచి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విద్యావ్యవస్థను తీర్చి దిద్దేందుకు ఈ విద్యా కమిషన్ పలు సూచనలు చేయనుంది. మేధావులు, రిటైర్డ్ అధ్యాపకులతో ఈ కమిషన్ చర్చించి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉపాధి కల్పనకు ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో ఈ విద్యాకమిషన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.