కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయనకు పార్టీ కమిటీలో ఎటువంటి పదవులు ఇవ్వలేదు.

Update: 2022-12-10 12:13 GMT

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయనకు పార్టీ కమిటీలో ఎటువంటి పదవులు ఇవ్వలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వంటి కారణాలతో ఆయనను పక్కనపెట్టింది. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారు. అందుకే కోమటిరెడ్డిని పార్టీ పక్కన పెట్టినట్లు తెలిసింది. మిగిలిన నేతలందరికీ కమిటీల్లో స్థానం కల్పించింది.

వర్కింగ్ ప్రెసిడెంట్లుగా....
తెలంగాణ కాంగ్రెస్ కు పార్టీ హైకమాండ్ కొత్త కమిటీలను ప్రకటించింది. 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. నలభై మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు. 25 జిల్లాలకు నూతన అధ్యక్షుల నియామకాన్ని చేపట్టారు. అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా పార్టీ అధినాయకత్వం నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు విభాగాలుగా నాయకత్వం విభజించింది.


Tags:    

Similar News