బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే

బీజేపీ, టీఆర్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు

Update: 2022-10-28 13:11 GMT

బీజేపీ, టీఆర్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉభయ సభల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందన్నారు. ఎవరి భూములను ఎలా లాక్కోవాలని చూస్తున్నారని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అటవీ భూముల హక్కుల చట్టాన్ని ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని తెలిపారు. బీజేపీకి బీ పార్టీగా టీఆర్ఎస్ గా వ్యవహరిస్తుందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం భూములను లాక్కుంటుందని ఆయన అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లను నమ్మవద్దని ఆయన కోరారు.

థరణి పోర్టల్ ను తీసేస్తాం...
ధరణి పోర్టల్ అంతా తప్పుల తడక అని ఆయన అభిప్రాయపడ్డారు. భూములను కాజేయడానికే ఈ పోర్టల్ ను తీసుకువచ్చారన్నారు. చేనేత వర్గాల వారితో తాను ఈరోజు భేటీ అయ్యానన్నారు. వారిపై జీఎస్టీ మోపి భారం కేంద్ర ప్రభుత్వం వేసిందన్నారు. చిన్న, మధ్య తరగతి వ్యాపారులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు భారత్ లోని ధనికులకు లాభం చేకూర్చడం కోసమే తీసుకు వచ్చిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే జీఎస్టీ మార్పులు తెస్తామని, దేశమంతా ఒకే జీఎస్టీని అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తన భారత్ జోడో యాత్రకు మీ నుంచి మద్దతు రావడం తనకు సంతోషం కలిగిస్తుందని ఆయన అన్నారు. యాత్రలో వివిధ కులాలు, మతాలు, ప్రాంతాల వారు పాల్గొంటున్నారన్నారు.


Tags:    

Similar News