ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ నాయకులు ఇంతేనా?

తెలంగాణ ఎన్నికల గురించి ఏమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం

Update: 2023-10-24 10:11 GMT

తెలంగాణ ఎన్నికల గురించి ఏమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో బడా నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటోంది. ఒక్కో నేత ఒక్కో తరహా సంచలన వ్యాఖ్యలతో రెచ్చిపోతూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి సరిపోకపోవడం అనేది సాధారణ సమయాల్లో పర్వాలేదు కానీ.. ఎన్నికల సమయంలో ఇలా రచ్చకెక్కడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తుకుంటున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు. తాజాగా ఆ లిస్టులోకి ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరారు. హుజూర్ నగర్ లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం వెళ్లిన ఉత్తమ్ కుమార్ కు కాంగ్రెస్ కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్, కవితలు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరికాదని మీది ఆ స్థాయి కాదన్నారు ఉత్తమ్. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు అని అన్నారు. రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మంచి పదవిలో కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉందని అందుకే చాలామంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. కొందరు పార్టీ మారే పరిస్థితి లేదని కానీ ఆ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెబుతున్నారని తెలిపారు.


Tags:    

Similar News