తొందరపాటు వద్దంటున్న సీతక్క
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..! సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని.. ప్రభుత్వం ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దుల మీద చర్చ జరగలేదు. మేం చర్చ జరిపాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చామన్నారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైందని ప్రశ్నించారు.