Congress : 40 మందికి ఓకే.. మిగిలిన వాటిలోనే
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నేడు మరోసారి జరగనుంది. రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తుంది
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నేడు మరోసారి జరగనుంది. రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తుంది. అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకూ నలభై మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే మిగిలిన స్థానాలపై కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నేడు కసరత్తులు చేేయనుంది. ఇప్పటికే టిక్కెట్ ఆశించే వారంతా ఢిల్లీకి చేరుకుని చివరి ప్రయత్నంలో ఉన్నారు. ఏఐసీసీ నేతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కండువాలు కప్పి...
కొత్తగా పార్టీలో చేరేవారిని చేర్చుకోవడంతో పాటు బలమైన నేతలయితే వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఇప్పటి వరకూ తొలి విడత అభ్యర్థుల జాబితాలో 55 మందిని మాత్రమే ప్రకటించిన కాంగ్రెస్ ఇక తుదివిడతగా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తుంది. ఈరోజు, రేపట్లో తుది జాబితా విడుదలయ్యే అవకాశముంది. రాహుల్ గాంధీ మలి విడత ప్రచారానికి వచ్చే ముందే జాబితాను ప్రకటించాలన్న నిర్ణయంతో ఉంది.