ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస కార్యకర్తలు టమాటాలు విసిరారు.;

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస కార్యకర్తలు టమాటాలు విసిరారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ గ్రామసభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామసభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామసభల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కౌశిక్ రెడ్డి గ్రామసభలో ప్రసంగం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కమలాపూర్ గ్రామసభలో...
ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపికను ఏ ప్రాతిపదికన చేశారంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేశారంటూ నిలదీశారు. దీంతో కమలాపూర్ గ్రామసభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ భారీ బలగాలను దించి ఇరువర్గాలను నచ్చ చెప్పే ప్రయత్నంచేశారు. గ్రామసభను అర్థాంతరంగా నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు.