తెలంగాణలో పెరుగుతున్న కేసులు
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52 కరోనా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్ లోనే 21 కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. వరస పండగలు, వాతావరణంలో మార్పులు, రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో కేసుల సంఖ్య పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నేటి నుంచి వ్యాక్సిన్...
దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పటికీ మొన్నటి వరకూ తెలంగాణలో పెద్దగా కేసులు నమోదు కాలేదు. కానీ నిన్న అత్యధికంగా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. నేటి నుంచి కోవిడ్ బూస్టర్ డోస్‌ను వేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరాను నిలిపేయడంతో తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపిణీకి సిద్ధమయింది. కార్బేబ్యాక్స్ టీకా డోసులను నేటి నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. తొలి రెండు డోసులు కోవిషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ కింద కార్బేవ్యాక్స్ ను తీసుకోవచ్చని తెలిపింది.