తెలంగాణలో పెరుగుతున్న కరోనా
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజు తెలంగాణలో ఇరవై కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజు తెలంగాణ వ్యాప్తంగా ఇరవై కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. ప్రస్తుతం తెలంగాణలో 149 కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు.
ఇరవై కేసులు....
నిన్న నమోదయిన ఇరవై కేసుల్లో పది హైదరాబాద్‌లోనివే. దీంతో అధికారులు మరోసారి కోవిడ్ నిబంధనలను ప్రజలు పాటించాలని కోరుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.