KTR : నేడు కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై తీర్పు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది.;

Update: 2025-01-07 02:35 GMT
ktr,  formula e car race case, judgment, high court
  • whatsapp icon

ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు తీర్పు వెల్లడించనుంది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలన్న కేటీఆర్ పిటిషన్ పై వాదనలు ఇటీవల ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది. నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది.

ఈడీ విచారణకు రాలేను...
అయితే నేడు ఈడీ విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు అందాయి. అయితే తాను విచారణకి హాజరు కాలేనని ఈడి ఇచ్చిన నోటీసులకి కేటీఆర్ లేఖ రాశారు. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వు ఉందని, హైకోర్టు పైన ఉన్న గౌరవంతో... హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. తర్వాత పంపిన తేదీకి తప్పక రావాల్సి ఉంటుందని ఈడీ నుంచి కూడా కేటీఆర్ కు సమాధానం వచ్చింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 



 


Tags:    

Similar News