Fake Kidnappings ఆ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి: సజ్జనార్ హెచ్చరికలు
కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌నకు గురైంది. ఆమె ప్రస్తుతం మాదగ్గరే ఉంది
మోసం చేసే వ్యక్తులు ఎన్నో దారులను వెతుక్కుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వచ్చే వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్ హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని సజ్జనార్ అన్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నాని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
"ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్రత్త!!
స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను కిడ్నాపర్లు చంపేస్తారంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
తాజాగా #Hyderabad రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ''నేను పోలీస్ ఆఫీసర్ ను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌నకు గురైంది. ఆమె ప్రస్తుతం మాదగ్గరే ఉంది. వెంటనే మేం అడిగినంత డబ్బును ఆన్లైన్ ద్వారా పంపించండి. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాపర్లు చంపేస్తారు." అని బెదిరించారు. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్‌ని వినిపించారు.
ఏడుస్తున్న గొంతు వినిపించడంతో కాలేజీకి వెళ్లిన తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందని తల్లిదండ్రులు భావించారు. డబ్బులు పంపించేందుకు సిద్దపడ్డారు. మోసగాళ్లతో ఫోన్లో మాట్లాడుతూనే తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశారు. తమ కూతురు కాలేజీలో ఉందో.. లేదో తెలుసుకోండని వారిని పంపించారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉందని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం నా దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు.
ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయి. ఆడ పిల్లలను కిడ్నాప్ చేశారని చెప్పగానే నమ్మి వారికి డబ్బులు పంపిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్‌కు స్పందించకండి. బెదిరింపులకు జంకకుండా స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి." అంటూ ఎక్స్ లో సజ్జనార్ సూచించారు.