మునుగోడు సమరంలో అభ్యర్థులు వీరే
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 47 మంది మునుగోడు ఎన్నికల బరిలో ఉన్నారు
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి. 36 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 47 మంది మునుగోడు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరి కోసం ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది.
ప్రధాన పార్టీలు...
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా పాల్వాయి స్రవంతి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు బరిలో ఉన్నారు. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రజల్లోనే ఉండి మద్దతును కోరుతున్నాయి.