Tiger : నిజంగానే పులి అందుకే మరణించిందా? దర్యాప్తులో తేలిందేమిటంటే?
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగజ్‌నగర్ మండలం దరిగాం అటవీప్రాంతంలో పులి మృతి చెందడాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అటవీ శాఖ అధికారులు పుల మృతి పై దర్యాప్తు చేస్తున్నారు. పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనేక అనుమానాలు...
అయితే ఈ పులిని ఎవరైనా చంపారా? వేటగాళ్ల పనా? అన్న అనుమానం కొందరిలో వ్యక్తమవుతుంది. అయితే రెండు పులల కొట్లాట కారణంగా ఒక పులి గాయాలపాలై మృతి చెందినట్లు కూడా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. విషాహారం తిని పులి చనిపోయిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంటుంది. పులిని కావాలని చంపారా? లేదా రెండు పులుల మధ్య కొట్లాట కారణంగా చనిపోయిందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.