Kalvakuntla Kavitha : నేడు లిక్కర్ కేసులో బెయిల్ పై తీర్పు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పనుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆమెను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ లాబీ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీపార్టీకి అందించారని సీబీఐ, ఈడీ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి.
సీబీఐ, ఈడీ కేసుల్లో...
మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను విచారించిన అనంతరం తీహార్ జైలులో ఉంచారు. సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత బెయిల్ పిటీషన్ పై ఇప్పటికే న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువడనుంది. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.