ఎలాంటి విచారణకైనా సిద్ధం

ఒక ఉప ఎన్నికలో గెలవాలంటే ఇన్ని డ్రామాలు అవసరమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

Update: 2022-10-27 07:28 GMT

ఒక ఉప ఎన్నికలో గెలవాలంటే ఇన్ని డ్రామాలు అవసరమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కొనుగోలు చేసింది ఎవరు? అమ్ముడు పోయింది ఎవరు? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటున్న ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసుందన్నారు. ఫాంహౌస్ వాళ్లదేనని, డబ్బులు ఇస్తానన్నది టీఆర్ఎస్ వాళ్లేనని, వారికే కేసీఆర్ కుటుంబంతో సంబంధాలున్నాయని బండి సంజయ్ తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చిల్లర వేషాలు వేస్తున్నారని బండి సంజయ్ మండి పడ్డారు.

అంతా వాళ్లే....
చివరకు ఫిర్యాదు ఇచ్చింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆయన అన్నారు. దీని వెనక ఒక పోలీసు అధికారి పన్నాగం ఉందని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. కమిషనర్ తన విధులు తాను నిర్వహించాలన్నారు. సీసీ టీవీ ఫుటేజీ మొత్తం బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ కు వారం రోజుల నుంచి ఎవరు వచ్చి వెళ్లారు? ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఎవరు కలిశారు? ఈ నలుగురి ఎమ్మెల్యేల కాల్ లిస్ట్ లను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పిన స్క్రిప్ట్ వేరు.. జరిగింది వేరని అన్నారు. తాము దీనిని వదలిపెట్టమని, హైకోర్టును ఆశ్రయించి అయినా దీనిపై నిగ్గుతేల్చాలని కోరతామని తెలిపారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని బండి సంజయ్ అన్నారు.


Tags:    

Similar News