నేడు కూడా అక్కడక్కడా చిరుజల్లులు

దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకూ విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశముంది;

Update: 2024-03-21 02:00 GMT
ap telangana rains

ap telangana rains

  • whatsapp icon

దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకూ విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకూ విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా ఉత్తర కోస్తాలోనూ చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఇప్పటికే రెండు, మూడు రోజుల నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. పలుచోట్ల వడగండ్ల వాన తో పంటలు దెబ్బతిన్నాయి. వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం కలిగినా అకాల వర్షంతో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News