హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నారు. 25 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 25 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ కు చెందిన లిక్కర్ వ్యాపారి రామచంద్ర పిళ్లై నివాసంలో ఇటీవలే సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో....
రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ సికింద్రాబాద్ లోని నవకేతన్ భవన్ లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే అక్కడ బ్యూటీ పార్లర్ ఉందని, దానికి డైరెక్టర్ గా అభిషేక్ రావు ఉన్నారని కూడా ఈడీ గుర్తించింది. ఈడీ అధికారులు మరింత సమాచారం కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.