బీఆర్ఎస్ లో చేరిన మాజీ సీఎం
బీఆర్ఎస్ లో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో వారు తెలంగాణ భవన్ లో చేరారు.
బీఆర్ఎస్ లో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగ్ చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో వారు తెలంగాణ భవన్ లో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. కోరాపుట్ స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారన్నారు. ఈ మహాసంగ్రామంలో మనతో కలసి నడిచేందుకు వస్తున్నారన్నారు. భారత్ లో అమెరికా కంటే ఎక్కువ సంపద ఉందన్నారు. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ అని అన్నారు. జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడిగిన వారు ఎన్నికలలో గెలిచి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
సంపద ఉన్నా....
చైనా కంటే కూడా మన సంపద ఎక్కువని కేసీఆర్ అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా తాగేందుకు మంచినీళ్లు తాగేందుకు కూడా ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. కనీస సదుపాయాలను కల్పించలేకపోతున్నామని తెలిపారు. విద్యుత్ ను కూడా కల్పించలేకపోతున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతులు కూడా చట్టసభల్లోకి రావాలని ఆయన అన్నారు. తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెడతామని తెలిపారు. న్యాయం బీఆర్ఎస్ వైపు ఉందని, ఖచ్చితంగా ఈ పోరాటంలో విజయం సాధిస్తామని తెలిపారు. రైతుబంధు, దళితబంధు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.