ముగిసిన నామినేషన్ల పర్వం

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. నిన్నటి వరకూ మొత్తం 2,028 నామినేషన్లు దాఖలయ్యాయి.

Update: 2023-11-10 12:19 GMT

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. నిన్నటి వరకూ మొత్తం 2,028 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు పూర్తి కావడంతో ఇక రేపటి నుంచి ప్రచారాన్ని అభ్యర్థులు మరింత వేగం పెంచుతున్నారు.

రెబల్స్ అభ్యర్థులపై...
దాఖలైన నామినేషన్లను ఈ నెల 13వ తేదీన పరిశీలన చేస్తారు. పదిహేనో తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఇక అభ్యర్థులు ఎలక్షనీరింగ్ పై అభ్యర్థులు దృష్టి పెట్టారు. రెబల్స్ గా పోటీ చేసిన వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బుజ్జగింపు చర్యలు ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News