పెనుప్రమాదం.. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు

ప్రమాదంలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు..

Update: 2023-07-07 06:43 GMT

falaknuma express accident

యాదాద్రి జిల్లా పగిడిపల్లి వద్ద ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. మంటలు గమనించి ప్రయాణికులు రైలు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది రైలును పగిడిపల్లి వద్ద నిలిపివేశారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇటీవల ఓ ఆగంతకుడు త్వరలోనే మరో రైలు ప్రమాదం జరుగుతుందని రైల్వే అధికారులకు లేఖ పంపిన నేపథ్యంలో.. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలులో సాంకేతిక లోపం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమయానికి ప్రయాణికులను దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా..రైలులో సిగరెట్ తాగడమే ప్రమాదానికి కారణమైందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఇదే రాత్రివేళ జరిగి ఉంటే.. ఎంత ప్రాణనష్టం జరిగేదో తలచుకుంటేనే వణుకు పుడుతుందని పేర్కొన్నారు.


Tags:    

Similar News