కేసీఆర్ కు జితేందర్ రెడ్డి సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణను ఎక్కడకు తీసుకెళుతున్నావని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధించాలని చూస్తున్నారని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ ను ఎవరు ఎందుకు హత్చ చేయాలనుకున్నారో చెప్పాలన్నారు. మహబూబ్ నగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎవరికైనా తన ఇంట్లో ఆశ్రయం దొరుకుతుందని జితేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు వస్తే ఎవరైనా ఆశ్రయం ఇస్తారని చెప్పారు. ఉద్యమ కారులపై కేసులు పెడుతున్నారన్నారు.
ఆశ్రయమిచ్చా....
తాను మున్నూరు రవికి ఆశ్రయమిచ్చిన మాట వాస్తవమేనని, మున్నూరు రవికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని జితేందర్ రెడ్డి అన్నారు. మున్నూరు రవి వెంట ఎవరు వచ్చారో తనకు తెలియదన్నారు. కేసీఆర్ ను చీప్ ట్రిక్స్ ను మానుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు భయం పట్టుకునే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తన డ్రైవర్ ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ చెడగొడుతున్నారన్నారు. తన రాజకీయ జీవితం గురించి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.