యాదాద్రికి నలుగురు సీఎంలు

యాదాద్రికి మరికాసేపట్లో నలుగురు ముఖ్యమంత్రులు రానున్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు

Update: 2023-01-18 04:04 GMT

యాదాద్రికి మరికాసేపట్లో నలుగురు ముఖ్యమంత్రులు రానున్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు వచ్చి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రుల పర్యటన సందర్భంగా యాదాద్రిలో భారీ ఏర్పాట్లు చేశారు. వారు పర్యటించే సమయంలో భక్తుల సందర్శనను నిలపేయనున్నారు.

బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం...
మరికాసేపట్లో ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రగతి భవన్ కు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపై నలుగురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. ప్రగతి భవన్ నుంచి యాదాద్రికి బయలుదేరి వెళ్లనున్నారు. యాదాద్రి నుంచి నేరుగా ఖమ్మం కు నలుగురు ముఖ్యమంత్రులతో పాటు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ నేత డి రాజాలు వెళ్లనున్నారు.


Tags:    

Similar News