నిజంగా నన్ను తిట్టలేదు: గడల శ్రీనివాస రావు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు రాజకీయపరమైన వ్యాఖ్యలు

Update: 2023-08-22 02:46 GMT

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు రాజకీయపరమైన వ్యాఖ్యలు పలు ప్రాంతాల్లో చేస్తున్నారు. కొత్తగూడెంలో ‘గడప గడపకు గడల’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ తరుణంలో డీహెచ్‌ శ్రీనివాసరావును మంత్రి హరీశ్‌రావు మందలించినట్లు ప్రచారం జరిగింది. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి, రాజకీయ ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగూడెంలో రాజకీయ ప్రకటనలు చేయొద్దని హరీశ్‌రావు తనకు సూచించారని, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారని జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని శ్రీనివాసరావు చెప్పారు. గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఈ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం తాను కొత్తగూడెంలోనే ఉన్నట్లు చెప్పారు. కొత్తగూడెం ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ‘గడప గడపకు గడల’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు.

అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలు చేస్తున్న వైద్యరోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు మంత్రి హరీష్ రావు క్లాస్ తీసుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. రాజకీయ ప్రకటనలు మానుకోవాలని శ్రీనివాసును హరీష్ రావు హెచ్చరించారట.. అంటూ వార్తలు వచ్చాయి. కొత్తగూడెంలో పొలిటికల్ కామెంట్లు చేయొద్దని గౌరవ మంత్రి హరీశ్‌రావు గారు నాకు సూచించినట్లుగా, ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు డాక్టర్ గడల శ్రీనివాసరావు.


Tags:    

Similar News