గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయ్

బంగారం ధరలు దేశంలో మళ్లీ పెరిగాయి. కరోనా కాలంలో కొంత పెరిగినా ఆ తర్వాత తగ్గడంతో వినియోగదారులు ఆనందపడ్డారు.

Update: 2021-11-15 02:07 GMT

బంగారం ధరలు దేశంలో మళ్లీ పెరిగాయి. కరోనా కాలంలో కొంత పెరిగినా ఆ తర్వాత తగ్గడంతో వినియోగదారులు ఆనందపడ్డారు. ఇప్పుడు మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా గ్రాముకు కనీసం వందరూపాయల ధర పెరుగుతుంది. దీంతో ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు వెండి ధర కూడా పెరుగుతుండటం విశేషం.

ధరలు ఇలా...
హైదరాబాద్ లో బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 210 రూపాయలు పెరిగింది. దీంతో 22 గ్రాముల క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,110లకు చేరుకుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120లు పెరిగి 50,190లకు చేరుకుంది. కిలో వెండి ధర మూడు వందలు పెరిగింది. దీంతో కిలో వెండి ప్రస్తుతం 71,700లుగా ఉంది.


Tags:    

Similar News