తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. రేపట్నుంచి సమ్మర్ హాలిడేస్
ఏప్రిల్ 24 (రేపు) నుంచి జూన్ 12వ తేదీ వరకూ వేసవి సెలవులు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న..
తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు పరీక్షలన్నీ ముగియడంతో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24 (రేపు) నుంచి జూన్ 12వ తేదీ వరకూ వేసవి సెలవులు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఎండలు మండుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి జూన్ 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవ్వనున్నాయి.
ఈ వేసవి సెలవులు 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకే వర్తిస్తాయి. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాక వేసవి సెలవులు మొదలవుతాయి. రేపట్నుంచి టెన్త్ విద్యార్థులకు రివిజన్ తరగతులు ప్రారంభమవ్వనున్నాయి. మే 23 నుంచి 28 వరకూ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.