వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సు 61 సంవత్సరాలుగా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ఎలాంటి ధన రూపేణ సహాయం అందించేవారు కాదు. ఇకపై అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, మినీ అంగన్‌వాడీ టీచర్లతో పాటు హెల్పర్లకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ తర్వాత ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు మినీ అంగన్‌వాడీ కేంద్రాల దశ కూడా మారనుంది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ సర్కార్ ప్రతీ ఒక్కరికి మేలు చేసేందుకు కృషి చేస్తుందనటానికి ఇదే నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడుసార్లు అంగన్వాడీల వేతనాలు పెంచారని సత్యవతి రాథోడ్ అన్నారు.