గూగుల్ న్యూస్ ఇన్షియేటివ్ ఆధ్వర్యంలో డేటా డైలాగ్ వర్క్ షాప్

భవిషత్‌ మీడియా రంగంలో పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కు సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకంగా మారతున్న దశలో..

Update: 2023-01-21 15:37 GMT

google news initiative data dialogue work shop

గూగుల్ న్యూస్ ఇన్షియేటివ్ ఇండియా ఆధ్వర్యంలో.. శనివారం హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో డేటా డైలాగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో.. డిజిటల్ యుగంలో వచ్చే..సాంకేతిక విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి టైమ్స్ ఆఫ్‌ ఇండియా ఎడిటర్‌, ప్రముఖ సీనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వర్క్ షాప్ నిర్వహణ గురించి మాట్లాడుతూ.. భవిషత్‌ మీడియా రంగంలో పనిచేసే ప్రతి జర్నలిస్ట్ కు సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకంగా మారతున్న దశలో దేశవ్యాప్తంగా గూగుల్ వర్క్‌షాప్‌ నిర్వహించడం శుభపరిణామం అన్నారు. మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని, తమ స్కిల్స్ ను మరింత డెవలప్ చేసుకోవాలని సూచించారు.

గూగుల్ న్యూస్ ఇన్షియేటివ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో డిజిటల్ మీడియాలో పనిచేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా తర్ఫీదు ఇచ్చారు. డేటా జర్నలిజం రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమను తాముగా ఆధునీకరించుకునేందుకు అవసరమైన మెళకువలు, నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. డేటా కలెక్షన్‌, డేటా మానిటరింగ్‌, క్లీనింగ్‌, డేటా వెరిఫికేషన్‌, డేటా విజువలైజేషన్‌ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో సామర్ధ్యాలను పెంపొందించేలా డేటా లీడ్స్‌ అనే సంస్థ తర్ఫీదు ఇచ్చింది.
ఈ సంస్థ డేటా జర్నలిజంలో వర్క్ షాప్ ను భారత దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, పూణె, ముంబయ్‌తోపాటు హైదరాబాద్‌లోనూ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. డేటా కలెక్షన్‌, డేటా వెరిఫికేషన్‌, డేటా లీడ్స్‌ సంస్థ పారుల్‌ గోస్వామి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా రంగంలో వినియోగించే సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు శిక్షణను ఇచ్చినట్లు తెలిపారు. గూగుల్‌ న్యూస్‌ ఇన్షియేటివ్‌ ఇండియా నిర్వహించిన డేటా డైలాగ్‌ వర్క్‌షాప్‌లో ఫాక్ట్‌లీ సంస్థకు చెందిన ప్రబుఖ ట్రైనర్‌ సంగీత్‌ ఓబ్రాయ్‌, రాకేష్‌ రెడ్డి దుబ్బుడు శిక్షణ ఇచ్చారు. ఒక్క రోజు పాటు నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో 100 మందికి పైగా జర్నలిజం విద్యార్థులు, ప్రముఖ జర్నలిస్టులు, మీడియా ఎడ్యుకేటర్స్‌, హెడ్‌ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్‌ అనిత పాల్గొన్నారు.


Tags:    

Similar News