Telangana : రాజయ్యకు నామినేటెడ్ పదవి
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమించడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇక లేనట్లే. ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తున్నందునే ముందుగా ఆయనకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమించిందని తెలిసింది.
ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా...
ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్యతో పాటు సభ్యులు ఎం. రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీరి పదవీ కాలం రెండేళ్ల పాటు ఉండనుంది. రాజయ్య పై కేసు నమోదయి గతంలో జైలుకు వెళ్లి రావడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ అధినాయకత్వం నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయనకు కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిని అప్పగించారంటున్నారు.